హీరో నాగ‌శౌర్య ఏమి చేశాడంటే..? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి..!

N ANJANEYULU
నాగ‌శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ల‌క్ష్య‌. ఈ సినిమాకు సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సొనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌ల‌పై నారాయ‌ణ‌దాస్ కే.నారంగ్‌,  పుస్క‌ర్ రామ్మోహ‌న్ రావు శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 10న ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌నున్న‌ది ల‌క్ష్య‌. ఇటీవ‌లనే విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు కూడా.
ఈ సినిమా కోసం నాగ‌శౌర్య చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. ఈ చిత్రంలో 8 ఫ్యాక్ తో హీరో క‌నిపించ‌నున్నాడ‌ని, రోమాంటిక్ హీరోయిన్ కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది అని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. తాజాగా ద‌ర్శ‌కుడు సంతోష్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఈ సినిమా గురించి పంచుకున్నాడు. క్రికెట్ అంటే ఓమ‌తం, ఓ దేవుడు అని అంతా అనుకుంటూ ఉంటారు. ఎన్నో ప్రాచీన విద్య‌లు మ‌రుగున ప‌డుతున్నాయ‌ని, బుద్దిజం మ‌న వ‌ద్దే పుట్టిన‌ది, కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇక్క‌డ ఉంద‌నే విష‌యం అస‌లు చాలా మందికి తెలియ‌డం లేద‌ని పేర్కొన్నారు. మ‌నం దేవుళ్లుగా కొలిచే వారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతుల్లో మాత్ర‌మే విల్లును చూస్తుంటాం.
ఇలాంటివ‌న్నింటిని క‌లిపి కొన్ని ఆట‌లు ఆడుతుంటామ‌ని చెప్పారు. కానీ ఆర్చ‌రీని మాత్రం విల్లు విద్య అని అంటామ‌ని, నేను క‌థ రాసుకున్న‌ప్పుడు న‌న్ను న‌మ్మి నారాయ‌ణ్‌దాస్ కే.నారంగ్‌, పుష్క‌ర్‌, రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మ‌రార్ లు అవ‌కాశం క‌ల్పించారు. నేను రాసుకున్న క‌థ న‌ల‌బై శాతం అయితే, వంద శాతం చేసిన‌ది నాగ‌శౌర్య అని.. ఆయ‌న లేకుంటే ఈ సినిమా ఇంత మంచిగా వ‌చ్చేది కాద‌ని చెప్పుకొచ్చారు ద‌ర్శ‌కుడు సంతోష్‌.
నిర్మాణ ప‌రంగా నిర్మాత‌లు స‌హ‌క‌రిస్తే.. క‌థ‌లో పార్థు అనే పాత్ర‌ను హీరో నాగ‌శౌర్య నెక్స్ట్ లేవ‌ల్‌కు తీసుకెళ్లారని పేర్కొన్నారు సంతోష్‌. విలుకాడికి సిక్స్ ఫ్యాక్ అవ‌స‌ర‌మా అని అంద‌రూ అన్నారు. కానీ విల్లు ఎంత పెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాల‌ని.. మూడు రోజుల పాటు క‌నీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా, ఉమ్ము కూడా మింగ‌కుండా ఉన్నార‌ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. 8 ఫ్యాక్స్ కోసం మూడు రోజులు అలాగే ఉండిపోయార‌ని గుర్తు చేసారు. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేద్క‌ర్ ఇలా అంద‌రూ న‌టీన‌టుడు అద్భుతంగా న‌టించార‌ని, కాళ‌భైర‌వ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ చెప్పారు ద‌ర్శ‌కుడు సంతోష్‌. దాదాపు రెండున్న‌ర ఏండ్ల పాటు ప‌డిన క‌ష్ట‌మ‌ని.. ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చిన హీరో నాగ‌శౌర్య‌కు ద‌ర్శ‌కుడు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: