అఖండ : బాలయ్య మీ డ్యాన్స్ కి, పెర్ఫార్మన్స్ కి నిజంగా దండాలయ్యా ... ??
ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఫైట్ సీన్స్ పెట్టిన బోయపాటి కీలకమైన కథ, కథనాల విషయమై మాత్రమే పెద్దగా శ్రద్ధ పెట్టలేదనేది కొందరు ప్రేక్షకుల అభిప్రాయం. ఇక ఈ అఖండ సినిమా చూసిన వారిలో ఎక్కువమంది, ఇది కేవలం బాలయ్య ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసమే తీసారా అనేలా మూవీ ఉందని మరికొందరు ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఈ అఖండ మూవీ కి అత్యంత బలంగా నిలిచింది మాత్రం హీరో బాలయ్య అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అంటున్నారు.
ముఖ్యంగా రెండు క్యారెక్టర్స్ లో కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ కనబరిచిన బాలయ్య సాంగ్స్ లో సూపర్బ్ గా స్టెప్స్ వేసి ఏజ్ పెరిగినప్పటికీ కూడా తనలోని గ్రెస్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసారు. ఇక బాలయ్య పెర్ఫార్మన్స్ కి థియేటర్స్ అయితే దద్దరిల్లుతున్నాయి. ఆ విధంగా అఖండ కి పర్వాలేదన్పించే సక్సెస్ అయినా దక్కడానికి పూర్తి కారణం బాలయ్య. ఆ విధంగా అటు తన ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని వారి మనస్సులో తన స్థానాన్ని మరింతగా పదిలపరుచుకున్నారు బాలయ్య. కాగా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అఖండ విషయంలో ఆనందంగా ఉన్నారు.