మెగా బ్రదర్ నాగబాబు.. మళ్లీ జడ్జిగా వచ్చేశారు?
జబర్దస్త్ కార్యక్రమం టాప్ కామెడీ షోగా బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరయింది. ఈ క్రమంలోనే ఇక జబర్దస్త్ జడ్జీగా ఉన్న నాగబాబు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. కల్మషం లేని తన చిరునవ్వుతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకర్షించారు. ఎన్నో ఏళ్ల పాటు జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగిన నాగబాబు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అకస్మాత్తుగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత జీ తెలుగు లో ప్రసారమయ్యే కామెడీ కార్యక్రమాలలో కూడా జడ్జిగా అవతారమెత్తారు నాగబాబు. ఆ తర్వాత ఆ కార్యక్రమం కూడా మూతపడడంతో ఇక బుల్లితెరపై కనుమరుగు అయ్యారు అని చెప్పాలి.
ఇక ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు జడ్జీ గా మారి పోయారు అన్నది అర్థమవుతుంది. ఇటీవలే మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే కార్యక్రమానికి జడ్జిగా అవతారమెత్తారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ గా మారిపోయింది. మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బుల్లితెరపై ప్రత్యక్షం అవడంతో బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఇక ఈ వీడియో చూసి అందరూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.