బోయపాటి ఇక మారడా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా బోయపాటి శ్రీను కి ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. బోయపాటి ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతోనే భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో బోయపాటి కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే  బోయపాటి సినిమాలు హై వోల్టేజ్ మాస్ యాక్షన్ తో ఉంటాయి. అలాంటి దర్శకుడు మరో సారి హై వోల్టేజ్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ 'అఖండ' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలయ్య కి సింహ, లెజెండ్ వంటి బంపర్ హిట్స్ ని అందించిన బోయపాటి ఈ సారి బాలయ్యతో 'అఖండ' సినిమాని తెరకెక్కించాడు.

 ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. అయితే ఇప్పటివరకు బోయపాటి తెరకెక్కించిన సినిమాలన్నీ ఒకే పంథాలో ఉండటం మనం గమనించవచ్చు. అయితే ప్రతిసారి ఒకే తరహా కథాంశంతో బోయపాటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాటిలో కొన్ని సార్లు విజయం అందుకున్నా.. మరికొన్ని సార్లు విఫలమయ్యాడు. అది ఇటీవల రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఈ విషయంలో మనం చూశాం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది.ఇక ఇప్పుడు అఖండ సినిమా కూడా అదే తరహా కథాంశంతో సాగుతోంది.

 దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను బోయపాటి ఆకట్టుకోలేక పోతున్నాడు. ఈ విషయంలో బోయపాటి తన పంథాని మార్చుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిసారి రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ కథా, కథనాలతో బోయపాటి సినిమాని నడిపించేస్తున్నాడని చాలామంది అంటున్నారు. ప్రజెంట్ ఆడియన్స్ సినిమాను చూసే తీరు కూడా మారింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇకపై నుంచి అయినా బోయపాటి తన రొటీన్ కమర్షియల్ ఫార్ములాని మార్చుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇక అఖండ సినిమా విషయానికి వస్తే ఇది కూడా రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలే కానీ ఇందులో అగోర పాత్రను డిజైన్ చేసి దానికి కమర్షియల్ అంశాలను జోడించాడు బోయపాటి. అందుకే ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: