చిరుతో నటించే విషయం పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ...!

murali krishna
చిరంజీవి 'గాడ్ ఫాదర్'చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారా లేదా అనే విషయంలో మీడియాలో చర్చ జరుగుతోందని తెలుస్తుంది.క్లారిటీ మాత్రం రావటం లేదని సమాచారం.. కానీ తాజాగా ఈ విషయమై హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారట.'లూసీఫర్' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించారని తెలుస్తుంది. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో చేయించాలనుకున్నట్టు సమాచారం అందుతుంది.
ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారట.ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్‌లోకి వచ్చిందని తెలుస్తుంది.ఫైనల్‌గా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.. ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ తనని చిరంజీవి గారు తన చిత్రంలో చేయమని అడిగారని తను `యస్` చెప్పానని అని అన్నారట.దాంతో సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ సెట్ అయ్యినట్లు అయ్యిందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచినట్టు తెలుస్తుంది.. అందుకు చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది.మరి చూడాలి సల్మాన్, చిరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో...!
ఇదిలా ఉండగా ఈ సినిమలో వివేక్ ఓబరాయ్ పాత్రలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటించబోతున్నట్టు వార్త వినిపిస్తుంది.. ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ నటించడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది.త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారట . ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: