సీనియర్ నటి 'ప్రభ' గురించి ఈ విషయాలు ఎంతమందికి తెలుసు?

VAMSI
అలనాటి సీనియర్ నటి ప్రభ ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగింది. ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి గొప్ప పేరును సంపాదించుకుంది. అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్ ప్రేక్షకులకు వారి గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. అయితే అలాంటి వారి కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
'భూమి కోసం' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సీనియర్ హీరోయిన్ కమ్ నటి ప్రభ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఒక్క చంద్రమోహన్ కు జోడిగా దాదాపు 18 చిత్రాలకు పైగానే ఈమె నటించడం విశేషం. అప్పట్లో వీరిది హిట్ పెయిర్ గా గుర్తింపు పొందింది. హీరో మురళి మోహన్ తో కూడా పదహారు చిత్రాలలో నటించారు ప్రభ. అయితే ఈమెకు చాలా గోల్డెన్ ఛాన్సులు మిస్ అయ్యాయని టాక్ ఉంది. మెగాస్టార్ చిరు నటించిన 'ఖైదీ' చిత్రంలో సుమలత పాత్రకు మొదట ప్రభాను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట.
అలా చాలా సూపర్ హిట్ చిత్రాలు ఆమె మిస్ అయినట్లు సమాచారం. ఇటీవల ప్రభా జేమ్స్ బాండ్, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలలోనూ నటించారు. కాగా ఈమె త్వరలో స్టార్ మా లో 'కలిసి ఉంటే కలదు సుఖం' సీరియల్ తో ప్రతిరోజూ బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పుడు వెండి తెర నటీనటులు సైతం బుల్లితెర పట్ల బాగా ఆకర్షితులు అవుతున్నారు. దీనికి కారణాలు ఏమిటా అనిచూస్తే, ఇక్కడ పెద్దగా టెన్సన్స్ ఉండవు. పైగా సినిమాల నుండి వచ్చిన వారు కావడం వలన గౌరవం , మర్యాద దక్కుతాయి. పారితోషికం కూడా అందరికన్నా మిన్నగా ఉంటుంది అన్న పలు కీలక కారణాల మూలంగానే ఇలాంటి వారు బుల్లితెరకు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: