చనిపోయే ముందు వరకు ఎంత బాదపడ్డాడో తెలిస్తే... కన్నీళ్లాగవు

VAMSI
తెలుగు సినీ పరిశ్రమకు మరో ఆణిముత్యం దూరమయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని బాధను మిగిల్చింది. సినీ గేయ రచయితగా 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిరివెన్నెల గారు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. సాహిత్య ప్రపంచాన్ని రారాజుగా ఏలిన ఆయన నిన్న కనుమరుగై పోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అంతా నివాళులు అర్పిస్తున్నారు. తీవ్ర అస్వస్థకు గురైన సిరివెన్నెల (66) గారు న్యూమెనియాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ లో చేరగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నవంబర్ 30న తుది శ్వాస విడిచారు. కిడ్నీ ఫెయిల్ అయిన కారణంగా ఆ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం చేత ఆయన మరణించారు అని కిమ్స్ వైద్యులు తెలిపారు.
అయితే ఆయన కొన్ని సంవత్సరాల ముందునుండే పలు అనారోగ్య సమస్యల కారణంగా తీవ్రం ఇబ్బంది పడ్డారట. ఆరేళ్ల క్రితం తొలుత ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంతో సర్జరీ జరిగిందని అనంతరం హార్ట్ ప్రాబ్లెమ్ రావడంతో బైపాస్ సర్జరీ కూడా జరిగింది అని ఈయన ఒబేసిటీ పేషంట్ కూడా అని అక్కడి డాక్టర్లు గత అనారోగ్య కారణాలను వెల్లడించారు.
ఇలా ఆయన గత ఆరేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ...ఎన్నడూ ఆయన పెదవిపై చిరునవ్వు చెరగలేదు. ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలను భరిస్తూ నిన్న మొన్నటి వరకు సినీ పరిశ్రమకు తన సేవలను అందించారు.
సుదీర్ఘమైన తన సినీ కెరీర్ లో వివాదాలు లేని మంచి మనిషిగా కొనసాగాడు. ఇప్పటికీ ఆయన్ని తలుచుకుని కనులు మూసుకుంటే ఆయన చిరుమందహాసమే గుర్తొస్తుంది. అటువంటి మహాత్ముడు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. గాన గంధర్వుడు ఎస్. పి బాల సుబ్రమణ్యం మరణ వార్త నుండి ఇంకా బయటకు రాకముందే సిరివెన్నెల ఇక లేరనే మరో పిడుగు లాంటి వార్త తెలుగు ప్రజల గుండెలను నిలువునా కాల్చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: