మహేష్ త్రివిక్రమ్ ల ఫైట్ దేనికోసం!!

P.Nishanth Kumar
ప్రస్తుతం సర్కారి వారి పాట చిత్రాన్ని రిలీజ్ చేసే పనిలో ఉన్న మహేష్ బాబు ఈ చిత్రం తర్వాత తన 28 వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు రాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు వీరి కాంబో లో తెరకెక్కబోయే ఈ మూడో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి మహేష్ తన తదుపరి సినిమాను రాజమౌళి తో చేయాల్సి ఉండగా అనూహ్యంగా త్రివిక్రమ్ చేతికి ఈ సినిమా వచ్చింది.

దీని తర్వాత రాజమౌళి సినిమా చేయాలని మహేష్ బావిస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళక పోవడంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహా పదుతున్నారు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అని తెగ ఆరాటపడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్ళ బోన్నట్లుగా తెలుస్తుంది. సెక్స్ మీద కు వెళ్లడం తోనే మహేష్ తో ఫైట్ సీన్ చిత్రీకరించబోతున్నారట త్రివిక్రమ్.

ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ తో ఇప్పుడు సినిమా చేయాల్సింది కాదు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అన్ని సిద్దం చేసుకోగా చివరి నిమిషంలో ఈ చిత్రం క్యాన్సిల్ అయిపోవడంతో వీరిద్దరూ చెరొక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఏదేమైనా టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ రెండవ సారి ఒక హీరోతో మూడవ సినిమా చేస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ తో ఆయన మూడు సినిమాలను చేయగా ఇప్పుడు మహేష్ తో మూడో సినిమా చేస్తున్నాడు. మరి ఈ హీరో కి ఏ రేంజ్ లో హిట్ ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: