బాహుబలి లో ఉన్న క్లారిటీ ఆర్ ఆర్ ఆర్ లో లేదు!!

P.Nishanth Kumar
రాజమౌళి దర్శకత్వం వహించిన టాలీవుడ్ తొలి పాన్  ఇండియా సినిమా బాహుబలి సినిమా ఎంత పర్ఫెక్ట్ తెరకెక్కిందో అంతే  పర్ఫెక్ట్ గా విడుదలై భారీ స్థాయిలో వసూళ్లను సాధించింది. ప్రభాస్ ను ఒక్కసారిగా నేషనల్ లెవెల్ హీరో గా మార్చిన బాహుబలి సినిమా ఏ విషయంలో ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగలేదు అంటే రాజమౌళి విజన్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాల, విడుదల రోజు వరకు కూడా ఎంతో చక్కగా అన్ని ప్రణాళిక ప్రకారం జరుగాయి. అందుకే బాహుబలి సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని చక్కగా కుదిరి సినిమా అంతటి స్థాయిలో విజయం సాధించింది.

ఇక ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఆ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి అనుభవాన్ని మిగిల్చ గా రాజమౌళికి మాత్రం 10 సినిమాలు చేసిన అనుభవాన్ని మిగిల్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తన అనుభవం అంతా రంగరించి ఇప్పుడు ఇద్దరు హీరోలు నటించిన ఆర్ ఆర్ ఆర్  సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఎంతో సాఫీగా సాగిన కూడా విడుదల విషయంలో ఎంతో గందరగోళం నెలకొందని చెప్పవచ్చు రాజమౌళి ఒకసారి విడుదల తేదీ ని ఫిక్స్ చేస్తే సామాన్యంగా దాన్ని మార్చడు.

కానీ ప్రపంచంలో ఏర్పడిన కొన్ని విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఇప్పుడు జనవరి 7వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయ్యింది. అయితే ఈ గందరగోళం కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది అనేది మాత్రం నిజం. సోలో హీరో సినిమానే అంతటి స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన రాజమౌళి ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ఈ సినిమాకి బాహుబలి సినిమా సాయి గుర్తింపు తీసుకు రాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ ప్రమోషన్ కార్యక్రమాలు ద్వారా నైనా రాజమౌళి ఈ చిత్రాniki క్రేజ్ ఎలా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: