రాధే శ్యామ్ డూప్ ను పెట్టి లాగించారా!!

P.Nishanth Kumar
బాహుబలి చిత్రం తర్వాత సాహో సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో ఈ సారి తప్పకుండా అభిమానులను అలరించే సినిమా చేయాలని చెప్పి ప్రభాస్ తన తదుపరి చిత్రం గా రాధే శ్యామ్ అనే ప్రేమ కథ సినిమానీ చేశాడు. చాలా రోజులుగా ఈ చిత్రం తెరకెక్కుతునే ఉండగా  కొన్నిసార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చి సినిమా ఔట్ డేటెడ్ గా మారింది ఇప్పుడు. కరోనా కారణం గా మరికొన్ని సార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడింది.

ఆ విధంగా రాధే శ్యామ్ సినిమా సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నారు. అయితే విడుదల తేదీని ప్రకటించకపోవడం అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆగ్రహం చూపించేలా చేసింది.  ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ప్రకటించిన తర్వాత అభిమానుల కోపం శాంతియుతమైనది. ఏదైతేనేం రాధే శ్యామ్ చిత్రం విడుదల కాబోతుందని అభిమానులు ఎంతగానో సంతోషపడగా ఈ సంతోషం ఎన్నో రోజులు లేకుండా పోయింది. దానికి కారణం ఈ సినిమా అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదనే వాదన ఎక్కువ వినిపిస్తుంది.

దానికి తోడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు అప్డేట్ లలో కూడా నాసిరకం ఎక్కువగా కనిపించడంతో సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోక పోవడమే మంచిదని భావిస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట విడుద ల కాగా ఆ పాటలో ప్రభాస్ కాకుండా ఆయన డూప్ తో ఈ పాటను షూట్ చేసినట్లు కొన్ని షాట్స్ ని బట్టి తెలుస్తుంది. దాంతో హీరో ఈ సినిమాపై ఎప్పుడో చేతులెత్తేశా డు అని ఈ సినిమాను విడుదల చేస్తే అభిమానులు ఓవర్ రియక్ట్ కాకూడదని కొంతమంది
 సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: