పవన్ సినిమా కి ఈ మార్పులు ఏంటి సామీ!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. జనవరి 12 వ తేదీన ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ చిత్రం తప్పకుండా పవన్ అభిమానులను ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. రానా మరో కథానాయకుడుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లుగా నిత్యమీనన్ మరియు సంయుక్త మీనన్ లు నటించారు.

ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని చేస్తుండగా ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది యూనిట్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుండగా తొలిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి జోనర్ సినిమా లో నటిస్తుండడం విశేషం. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగవద్గీత అనే చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్తుండగా హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని షూటింగ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. 

ఈ సినిమాలో పూజా హెగ్డే ను కథానాయికగా ఫిక్స్ చేయగా,  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమాను ఇప్పటికే ఓకే చేశాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ ఏజెంట్ సినిమా చేయగా ఆ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి తొందర్లోనే పవన్ సినిమాకు షిఫ్ట్ అవబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ మరాడట. గతంలోనూ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కి సినిమాటోగ్రఫర్ మారగా ఎందుకు పవన్ సినిమాలకు ఈ విధంగా టెక్నీషియన్లు మారుతున్నారు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది. కారణం ఏదైనా సినిమా సినిమాకు ఇలాంటి మార్పులు ఉంటే అది పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంటుందనేది అభిమానుల వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: