రచయిత సుద్దాల అశోక్ తేజ గురించి ఈ విషయాలు తెలుసా?

VAMSI
ప్రముఖ గేయ రచయత సుద్దాల అశోక్ తేజ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. టాలీవుడ్ లో ఈయనది సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పాలి. 'నమస్తే అన్న’ సినిమాతో గేయ రచయతగా ఈయన సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఈ చిత్రానికి కే.రంగారావు దర్శకత్వం వహించగా..తనికెళ్ళ భరణి మాటలను అందించారు. నటుడు తనికెళ్ళ భరణి వంటి వారి ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోని అడుగుపెట్టిన రచయిత తేజ తన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత ఆయన వెను తిరిగి చూసింది లేదు. 'ఒసేయ్ రాములమ్మ' చిత్రం ఈయన కెరీర్లోనే ఒక కీలక మైల్ స్టోన్ గా నిలిచింది.
ఈ సినిమాతో ఆయనకు రచయితగా దేశ నలుమూలల నుండి ప్రశంసలు అందాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఠాగూర్' చిత్రంలో తేజ రచించిన 'నేను సైతం'  అనే పాట టాలీవుడ్ లో సంచలనంగా మారింది. అంతేకాదు ఈ పాటకు గాను ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ లో మహాకవి శ్రీశ్రీ, గొప్ప రచయిత వేటూరి వంటి వారి తర్వాత జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఘనత అశోక్ తేజ ను వరించడం విశేషం. టాలీవుడ్  నటుడు ఉత్తేజ్ ఈయన మేనల్లుడు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఆ మధ్య అశోక్ తేజకు కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఆయన చిన్న కొడుకు అయిన అర్జున్ తేజ తన తండ్రి కోసం తన  కాలేయాన్ని దానం చేయగా ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. అప్పట్లో తండ్రిని మించిన తనయుడు అంటూ వీరి మధ్య ప్రేమానురాగాల గురించి చాలా వార్తలే వచ్చాయి. నిజంగా అర్జున్ తేజ తన తండ్రి కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇక అశోక్ తేజ 1200కి పైగా సినిమాలలో 2200 పైగా పాటలు రచించి మనకు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: