సమంత ఇక దానికే పరిమితమా!!

P.Nishanth Kumar
సమంత విడాకుల తర్వాత మళ్లీ సినిమాలో నిలదొక్కుకునే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోగా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించబోతోందని తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ఉన్న సమయంలోనే ఆమె ప్రేమించిన అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకొని పెద్ద హీరోల సరసన చేసేందుకు వెనుకాడింది. కానీ వెబ్ సిరీస్ లలో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చి అప్పుడే సినిమాలను వదిలేది లేదని ఆమె వెల్లడించింది.
మరోవైపు అక్కినేని అభిమానులు మాత్రం పెళ్లి తర్వాత సమంత సినిమాలు చేయడం తమకు నచ్చడం లేదని బహిరంగంగానే చెప్పడం మొదలుపెట్టారు. ఎన్నో చర్చలు వాదనల తర్వాత ఆమె క్రమక్రమంగా సినిమాలను తగ్గిస్తూ బాగా ఇప్పుడు కాలం ఆడిన వింత ఆట లో ఆమె విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తుంది. అయితే  ఇప్పుడు ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. దాంతో ఆమె తనకున్న పరిచయాలతో సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే టాలీవుడ్ లో కూడా ఈ మేరకు సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందట. కానీ ఎప్పుడు ఎలా ఆమెకు అవకాశం వెతుక్కుంటూ వస్తుంది అనేది చూడాలి. ఇక తాజాగా ఆమె అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఐటం సాంగు ను జోడించడంతో అందులో సమంత అయితే బాగుంటుందని ఆలోచించి దర్శకుడు సుకుమార్ ఈ విధమైన పాట ను చేశారట. మరి ఈ సినిమా ఆమెకు ఏమేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.ఇక తెలుగు లో ఆమెకు కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అవకాశాలు వశున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: