నవంబర్ కూడా పాయే.. డిసెంబర్ మాత్రమే దిక్కు!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమకు రెండవ లాక్ డౌన్ తర్వాత ఏ మాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. వచ్చిన సినిమా వచ్చినట్లు రెండు రోజులు మాత్రమే తెరపై కనువిందు చేసి ప్రేక్షకులను పెద్దగా మెప్పించకుండానే ఆ చిత్రం వెళ్ళిపోతుంది. దాంతో ఈ సారి తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే సినిమా రావాలని ప్రేక్షకులు తో పాటు సినిమా వారు సైతం కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. ఏదైతేనేం నవంబర్ నెలలో కూడా తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించే సినిమా రాలేదని చెప్పాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా రాలేదు అని చెప్పాలి.
మధ్యలో కొన్ని సినిమాలు లవ్ స్టోరీ వంటివి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదని తెలిసిపోయింది. దీంతో డిసెంబర్ నెలలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరింఛి వారిని థియేటర్లకు రప్పించే సినిమాలు అవ్వాలని ఎదురు చూడడం టాలీవుడ్ వంతు అయింది డిసెంబర్ 2వ తేదీన బాలకృష్ణ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే పుష్ప, గని, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు కూడా ఇదే నెలలో రాబోతున్నాయి.  అయితే ఇవి ప్రేక్షకులను థియేటర్లకు ఎంతవరకు తీసుకొస్తాయి అనేది చూడాలి. ఇప్పటికే ఈ సినిమా అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుండగా ప్రేక్షకుల్లో కూడా వాటిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే డిసెంబర్ నెల మీద ఆధారపడి జనవరి లో వచ్చే సినిమాలు ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు. అసలే సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా అవి పెట్టిన డబ్బులను వెనక్కి తీసుకోవాలి అంటే తప్పకుండా డిసెంబర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే తీరాలి. లేదంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు భారీ నష్టాలను చవి చూడక తప్పదు. మరి డిసెంబర్ లో విడుదల అవుతున్న సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయి చూడాలి. నవంబర్ నెలలో ఒక్క చిత్రం కూడా ఎక్స్ట్రా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించ లేకపోవడంతో ఇప్పుడు డిసెంబర్ లో విడుదలయ్యే సినిమాల మేకర్స్ కొంత టెన్షన్ లో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: