కృష్ణ బయోపిక్...? మహేష్ నిర్మాత...?

Sahithya
మన తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా మంచి కథ ఉంటే బయోపిక్ లో నటించడానికి చాలా మంది ఎదురు చూసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. చాలా మంది అగ్ర హీరోలు బయోపిక్లో సంబంధించి ఆసక్తికరంగా ఉన్న సరే కొంతమంది మాత్రం వెనకడుగు వేయడంతో నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కొంతమంది బయోపిక్ లకు సంబంధించి టాలీవుడ్ అగ్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని మంచి కథ ఉంటే చాలు సినిమాలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని సామాజిక సేవ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు హైలెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే రాజకీయాలతో సంబంధం ఉన్న కొంతమంది సినీ నటులకు సంబంధించి కొన్ని పాత్రలు పోషించేందుకు కొంత మంది సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల బయోపిక్ లతో పాటుగా తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారి బయోపిక్ లను కూడా తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన కృష్ణ బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నారని అయితే దీనికి సంబంధించిన కథ ఇంకా రెడీ కాకపోవడంతో పరుచూరి బ్రదర్స్ తో  కథ రెడీ చేయిస్తున్నాడని వాళ్లు కూడా కథను చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. పరుచూరి బ్రదర్స్ కథ సిద్ధమైతే మహేష్ బాబు తన తండ్రి పుట్టిన రోజు నాడు బయోపిక్ శ్రీకారం చుట్టే అవకాశం ఉందనే వార్తలు తెలుగు సినిమా వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా ముందు అడుగు పెట్టబోతోంది కృష్ణ బయోపిక్ నిర్మాతగా మహేష్ బాబు వ్యవహరిస్తారా లేకపోతే ఎవరైనా వ్యవహరిస్తున్నారా అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: