అమీర్ ఖాన్ తర్వాత టార్గెట్ జూనియర్ ఎన్టీఆర్...?

Sahithya
మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతల ఎదురు చూసే పరిస్థితి ఉండగా బాలీవుడ్ లో కూడా దాదాపుగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని బాలీవుడ్ లో కనీసం ఒక సినిమా అయినా సరే నటించే విధంగా ఒప్పించాలని కొంతమంది నిర్మాతల ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంత మంది అగ్ర హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త కట్టుదిట్టంగా సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ అగ్రహీరో  అమీర్ ఖాన్  కాస్త సీరియస్ గా దృష్టి పెట్టారనే తెలుగు సినిమా లో ఉన్న కొంతమంది నటులు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక సినిమాలో నాగచైతన్య తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తో ఒక కీలక పాత్ర చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దీనికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సినిమాలు పూర్తి చేసే విధంగా ముందుకు వెళుతుంది కాబట్టి ఇతర భాషల హీరోలు సహకారం కూడా ఆశిస్తోంది అని అంటున్నారు. ఇతర భాషల హీరోలు కూడా దాదాపు ఇదే ఆలోచనతో ఉన్నారని అందుకే అమీర్ ఖాన్ తన తర్వాత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి కాస్త మంచి పాత్ర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి నెగిటివ్ రోల్ అయినా సరే రెడీగా ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: