మహేష్ విలన్ గా బాలీవుడ్ అగ్ర హీరో...?

Sahithya
మన తెలుగులో కొంత మంది బాలీవుడ్ హీరోలకు డిమాండ్ కాస్త ఈ మధ్య కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న హీరోలు ఇక్కడ సినిమాలు చేయడానికి కొంత మంది అగ్ర హీరోలతో అదేవిధంగా అక్కడ దర్శక నిర్మాతలతో ఈ మధ్యకాలంలో చర్చలు జరుపుతున్నారు. కొంతమంది అగ్రహీరోలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు మంచి కథలు సిద్ధం చేసుకుని హీరోల కోసం రెడీగా ఉన్నారు. కొంతమంది హీరోల విషయంలో అగ్ర నిర్మాతలు ఈ మధ్యకాలంలో పునరాలోచనలో పడ్డారని ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత మంది హీరోలకు సంబంధించి భారీ బడ్జెట్ పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇతర భాషల్లో ఉన్న వారిని తీసుకు వచ్చే సినిమాలు చేయడానికి చాలా వరకు కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. అయితే కొంత మంది బాలీవుడ్ అగ్రహీరో లకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ చాలా ఆసక్తికరంగా ఉందని ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా లో ఉన్న కొంతమంది దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఇతర భాషల హీరోలు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక హీరో పేరు ప్రముఖంగా మన తెలుగు లో వినపడుతోంది. అక్షయ్ కుమార్ విషయంలో చాలా వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తికరంగా ఉన్నారని ఆయనకు విలన్ పాత్రలు  ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు హీరోగా వచ్చే కొత్త సినిమాలో ఆయన విలన్ గా నటించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు ముందుకు రాబోతుంది ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొని మహేష్ బాబు కూడా తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: