సిరివెన్నెల కాదు చిరునవ్వుల సీతారామశాస్త్రీ

Vimalatha
తెలుగు సినిమా చరిత్రలో లెజెండ్ గా తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు సిరివెన్నెల. ఆయన పేరు టాలీవుడ్ లో సువర్ణాక్షలతో లిఖించడానికి ముఖ్య కారణం ఆయన సాహిత్యంతో పాటు వ్యక్తిత్వం కూడా. ఆయన రాసే ప్రతి పదం ఓ అద్భుతం. చిన్న చిన్న పదాలతోనే పెద్ద పెద్ద ఎమోషన్స్ ను వ్యక్తపరచగల వ్యక్తి సిరివెన్నెల. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతీదేవి తాండవిస్తుంది అనేది సినిమా ఇండస్ట్రీ మాట. సాహిత్యం అంటే ఆయనకు ఎంత మక్కువ అంటే అర్ధరాత్రి మెలకువ వచ్చినా పాటలు పాడేవారు. ఒక్కో పాటకు 15 వెర్షన్స్ రాసేవారట. ఆయన పాటలు వజ్రం పొడిగినట్టుగా ఉండేవి. ఒక్క్కో పదాన్ని చెక్కేవారు. సిరివెన్నెల తెలుగు జాతికి గర్వకారణం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చిరునవ్వులు విరబూసేవని, ఆత్మీయత పారవశ్యం అనుభూతి చెందేవారమని ఆయనతో సన్నిహితంగా ఉండేవారంతా అంటూ ఉంటారు. అందుకే ఆయనను చాలా మంది సిరివెన్నెల కాదు చిరునవ్వుల సీతారామశాస్త్రీ అని పిలుచుకుంటారు తెలుగు చిత్ర సీమలో. ఆయన పిలిచే తీరులోనూ, పేరును పలికే విధానంలోనూ ఒక అన్న, ఒక బాబాయ్, ఒక పెదనాన్న కన్పించేవారట. మరి ఆయన లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాటలు రాబోతున్నాయి అంటే సమాధానం శూన్యం.
గత రెండ్రోజుల క్రితమే ఆయన చనిపోయారన్న వార్తలు రాగా, కుటుంబం ఖండించింది. అయితే ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఆరోగ్యంగా మాత్రం తిరిగి రాలేకపోయారు. ఇండస్ట్రీకి ఇది కోలుకోలేని దెబ్బ. ఆయన కుటుంబానికి ప్రముఖులంతా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ వరుస పాటలు పాడుతూ హడావిడిగా ఉండే ఆయన ఇప్పుడు ఇలా నింపాదిగా నిద్ర పోవడం చూడలేకపోతున్నాము అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు సెలెబ్రిటీలు. సినిమా ఇండస్ట్రీ నుంచి వరుసగా ఒక్కొక్కరినీ కోల్పోవడంతో ఏం పాపం చేశామో అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఏదేమైనా సిరివెన్నెల చిరునవ్వులను కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: