సిరివెన్నెలకు టాలీవుడ్ కన్నీటి నివాళి... కడసారి వీడ్కోలు పలికిన స్టార్స్

Vimalatha
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక శకం, ఒక యుగం ముగిసిపోయిందని సినీ ప్రముఖులు బాధను వ్యక్తం చేస్తున్నారు. తన కెరీర్ లో దాదాపుగా 3000 పాటలు అందించిన ఆయనను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ మరువలేదు. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. సిరివెన్నెల మృతదేహాన్ని ఫిల్మ్ నగర్ ఫిలిం ఛాంబర్ లో ఉంచగా టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. స్టార్ నుంచి సీనియర్ ఆర్టిస్టుల దాకా, మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి సింగర్స్ దాకా, లిరిసిస్ట్ లు, దర్శకుల నుంచి నిర్మాతల దాకా ఎంతోమంది దిగ్గజ నటులు ఆయన ఆంత్మ శాంతించాలని కోరుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నరేష్, రాజశేఖర్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్,  మహేష్ బాబు, నాని, బాలకృష్ణ, మురళీ మోహన్, మణిశర్మ, సింగర్ సునీతతో పాటు పలువురు ప్రముఖులు సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని వీక్షించి కన్నీటి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒక్కటే... ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీకి తీరనిది. మరో సీతారామశాస్త్రి దొరకడం కష్టం... ఒక శకం ముగిసిపోయింది. టాలీవుడ్ స్టార్స్ అంతా తమ బాధను వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని వెల్లడించారు. ఆయనతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. వ్యక్తిత్వం పరంగా ఆయన ఎలాంటి వారు అన్న విషయాన్నీ వ్యక్తం చేస్తున్నారు.
ఇక త్వరలోనే ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఇప్పటికే సిరివెన్నెల అంతిమ యాత్ర కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఓ లెజెండ్ నేలకొరిగారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. సిరివెన్నెల ఆత్మ శాంతించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: