వెల "సిరి" : సిరివెన్నెల కలం ఆగినా.. ఆయన అక్షరాలు చిరస్మరణీయం..!

NAGARJUNA NAKKA
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన మొదటి పాట విధాత తలపున. తొలి పాటే ఆయనకు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎనలేని స్థానం కల్పించింది. ఈ పాట రాసేందుకు వారం రోజులు పట్టింది. ఈ సినిమా ద్వారానే సిరి వెన్నెలను సినీ గేయ రచయితగా డైరెక్టర్ కె.విశ్వనాథ్ పరిచయం చేశారు. అయితే ఆయన రాసిన తొలిపాటను బాల సబ్రహ్మణ్యం.. సుశీల ఆలపించారు. ఆ పాట అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఓ మైలు రాయిలాంటిదే.
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటల్లో ఇది బాగుంది అని చెప్పడం కష్టం. ఆయన కలం అందించిన ప్రతిపాట అద్భుతమే. అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అనే పాట సిరివెన్నెలకు మంచి పేరు తీసుకొచ్చింది. నువ్వే కావాలి సినిమాలో కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు, అనగనగా ఆకాశం ఉంది అనే పాటలతో యువ హృదయాలను తాకారు సిరివెన్నెల. మనసంతా నువ్వేలో తూనిగ తూనిగ పాటతో బాల్యాన్ని ఆవిష్కరించారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అనే పాట రాసినందుకు సిరివెన్నెలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. 1993లో వచ్చిన ఈ చిత్రంలో జగపతిబాబు, రేవతి జంటగా నటించారు. సిరివెన్నెల రాసిన అద్భుతమైన పాటలకు మొత్తం 11నంది పురస్కారాలు వచ్చాయి.
సిరివెన్నెల సీతారమశాస్త్రి రాసిన కొన్ని ఆణముత్యాల్లో జగమంత కుటుంబం నాది, నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని, జాము రాతిరి జాబిలమ్మా, విధాత తలపున ప్రభవించినది, నమ్మకు నమ్మకు ఈ రేయిని.. అందెల రవమిది, బోటనీ పాటముంది.. మ్యాటనీ ఆట ఉంది.. అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని, నీకాళ్లను పట్టుకొని.. లాంటి పాటలు మరిచిపోలేనివి.

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో సుమధుర గీతాలను అందించారు సిరివెన్నెల. సిరివెన్నెల, స్వయం కృషి, రుద్రవీణ, స్వర్ణకమలం, శృతిలయలు, పట్టుదల, పవిత్ర బంధం, శివ, క్షణక్షణం, గాయం, గులాబీ, మనీ, నిన్నేపెళ్లాడతా, నువ్వేకావాలి, సింధూరం, దేవీపుత్రుడు, చంద్రలేఖ, నీస్నేహం, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటనా, చక్రం, హ్యాపీ, ఒక్కడు, ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాశారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: