వెల 'సిరి' : కెరియర్ మొదట్లో సిరివెన్నెలకు పేరు తీసుకొచ్చిన సినిమాలు?

praveen
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అందరినీ కోలుకోలేని విషాదంలోకి నడుస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసారూ. ఈ బాధ నుండే తెలుగు ప్రేక్షకులు తేరుకోలేదు. ఇప్పుడు కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో నెట్టింది. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ లో చేరిన అయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. . సిరివెన్నెల సీతారామశాస్త్రి  సినీ కెరీర్‌లో కొన్ని ఆణిముత్యాలు తెల్సుకుందాం..
 సినీ గేయ ర‌చ‌యిత‌గా సిరివెన్నెల 1984 బాలకృష్ణ హీరోగా కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో సినీ గెేయ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
 ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో ఎంతో గుర్తింపు పొందిన పాటల రచయిత గా మారిపోయారు.  ఈ సినిమాతో అయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. . ఆ తర్వాత  జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసినప్పటికీ అంత గుర్తింపు రాలేదు.  ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు ఆయనకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.  ఈ సినిమాతో తొలి నంది అవార్డును అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

 ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణ కమలం’ సినిమా సిరివెన్నెల కు ఎంతగానో  కీర్తిని తీసుకొచ్చింది. ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు  ఎవర్ గ్రీన్. ఇళయరాజా సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం బాలు గాత్రం కూడా తోడవడంతో ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించారు.

రాజశేఖర్, సుమలత హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘శృతి లయలు’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి  రాసిన ‘తెలవారదేమో సామి’ పాటను సిరివెన్నెల రాసారని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో మరో నంది అవార్డు అందుకున్నారు సిరివెన్నెల.

తర్వాత బాలచందర్ మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమా సిరివెన్నెల కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సిరివెన్నెల రాసిన అన్ని పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.

నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమాలో బోటని పాటం ఉంద.. మ్యాటనీ ఆట ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలికింది.
 విశ్వనాథ్ తర్వాత రామ్ గోపాల్ వర్మతో సిరివెన్నెల కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది . రాంగోపాల్ వర్మ తీసిన ఎన్నో సినిమాలు ఈయన పాటలు రాశారు.

 ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శుభ లగ్నం’ సినిమాలోని చిలుకా ఏ తోడు లేక భావోద్వేగంతో కూడిన పాట తెలుగు ప్రేక్షకుల మదిని కదిలించింది. ఈ పాటకు కూడా నంది అవార్డు సిరివెన్నెల ను వరించింది.
 కె.విశ్వనాథ్ రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ లాంటి దర్శకులకు ఎన్నో సినిమాలకు పాటలు రాశారు సిరివెన్నెల.  ‘సిందూరం’ సినిమాలో సిరివెన్నెల రాసిన  విప్లవ పాటలు ఆయనలోని మరో కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయ్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘సముద్రం’ మహాత్మ తో పాటు పలు చిత్రాలకు పాటలు అందించారు.

 ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘చక్రం’ చిత్రంలో ‘జగమంత కుటుంబం నాది’ ఏకాకి జీవితం నాది అంటూ సిరివెన్నెల రాసిన పాట అందరిని ఆకర్షించింది.
 ఇక కృష్ణ వంశీ  మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మురారి’ కూడా రచయతగా ఈయనకు మంచి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

 పాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల మృతితో  తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసిపోయిందని  అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వేటూరి తర్వాత తెలుగు సినిమాలకు అండగా ఉంటారనుకున్నా సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా  కన్నుమూయడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: