పది భాషల్లో సత్తా చాటిన శివ శంకర్ మాస్టర్..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్సర్ శివ శంకర్ మాస్టర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ లో ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందిన సంగతి అందరికి తెల్సిందే. శివ శంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అయితే శివ శంకర్ మాస్టర్ వ్యక్తి గత జీవితం గురించి ఒక్కసారి చూద్దామా.
ఇప్పటివరకు శివ శంకర్ మాస్టర్ దేశవ్యాప్తంగా దాదాపుగా పది భాషలలో కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇక దాదాపుగా ఎనిమిది వందల సినిమాలకు పైగా డాన్స్ మాస్టర్ గా పనిచేసిన ఆయన పలు భాషల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కూడా అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేసిన శివ శంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డును అందుకున్నారు.
అలాగే శివ శంకర్ మాస్టర్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బాహుబలి సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేశాడు. అంతేకాక శివ శంకర్ మాస్టర్ మృతి చెందారని తెలియగానే తెలుగు ఇండస్ట్రీ వారే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శివ శంకర్ మాస్టర్ బుల్లితెరపై కూడా పలు షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన పలు షోలకు వ్యక్తగా వ్యవహరించారు. అంతేకాదు శివ శంకర్ మాస్టారు ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారు. అంతేకాదు.. ఆయన కింద శిష్యులుగా చేసిన వారంతా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కొరియోగ్రాఫర్ లుగా రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: