నిర్మాతగా ఎన్టీఆర్ ఎవరి సినిమాకో తెలుసా...?
అయితే ఇప్పుడు అది నిజమే అనే వ్యాఖ్యలు కూడా టాలీవుడ్ వర్గాలలో వినబడుతున్నాయి. ఒక కొత్త హీరోని జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేయబోతున్నాడని ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ గా ఉండటమే కాకుండా హీరో పాత్ర కూడా కాస్త ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చూపిస్తూనే హీరో పాత్రను కూడా ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉందని త్వరలోనే దీనికి సంబంధించి సుకుమార్ తో మాట్లాడుతున్నాడు అని ఈ సినిమాను బుచ్చి బాబు తెరకెక్కించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ 8 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాడని 8 కోట్లతో ఈ సినిమాకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అవసరమైతే మరో హీరో కూడా దీంట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి ఇది ఎంతవరకు ముందుకు రాబోతున్నారు ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా ఆ తర్వాత కన్నడ దర్శకుడితో అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.