టాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ అతనే : శివశంకర్ మాస్టర్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. కొంతమంది నటనతో  గుర్తింపు తెచ్చుకొని అభిమానులను ఆకర్షిస్తే.. మరికొంతమంది నటనతో పాటు అదిరిపోయే డాన్సులు కూడా చేసి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోలు ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ డాన్సర్లు ఎవరూ అంటే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటూ ముగ్గురి పేర్లు చెబుతారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఈ ముగ్గురిలో నెంబర్ వన్ డాన్సర్ ఎవరు అంటే మాత్రం  చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ముగ్గురు హీరోలు కూడా తమదైన శైలిలో డాన్సులు చేస్తూ ఎప్పుడూ ఇరగదీస్తూ ఉంటారు.

ప్రతి సినిమాలో కూడా సరికొత్త డాన్సులతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంటారు. ఇలా ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్సర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో నే తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్సర్ అని అనుకుంటూ ఉంటారు. అయితే  డాన్స్ మాస్టర్ లను ఈ ప్రశ్న అడిగినా కూడా టాప్ డాన్సర్  ఎవరు చెప్పడానికి కూడా సతమతమై పోతుంటారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో వందల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి ఇటీవలె కరోనా వైరస్ కారణంగా తుదిశ్వాస విడిచిన శివ శంకర్ మాస్టర్  మాత్రం ఒకానొక సమయంలోఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్సర్ ఎవరు అన్న విషయాలు చెప్పుకొచ్చారు.

 అయితే శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూకు హాజరు అయ్యారు. ఇక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో  విడుదలైంది. దీంతో ఇక శివ శంకర్ మాస్టర్ జ్ఞాపకాలను మరోసారి అభిమానులు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ డాన్సర్ ఎవరు అంటే అల్లు అర్జున్ అని చెప్పేసాడు శివ శంకర్ మాస్టర్. అల్లు అర్జున్ ఒక గొప్ప డాన్సర్.. ప్రతి సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతూ ఉంటాడు. అతను డాన్స్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది అంటూ శివశంకర్ మాస్టర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: