కరోనా ఉదృతమవుతున్న వేళ... 'ఆర్ ఆర్ ఆర్' విడుదల ఎలా?

VAMSI
ప్రపంచాన్నే గడగడ వణికించిన కరోనా వైరస్ గత మూడు నాలుగు నెలల నుండి కాస్త శాంతించింది. మళ్ళీ వచ్చే ఏడాది మొదటి నెలలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని కరోనా ఉగ్ర రూపం దాలుస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సెకండ్ వేవ్ సమయంలో కరోనా విజృంభించడంతో లాక్ డౌన్ పేరిట చిన్న పెద్ద పరిశ్రమలన్నీ మూసివేశారు. థియేటర్లకు కూడా తాళం పడి వెలవెలబోయిన విషయం తెలిసిందే. కాగా భారీ ప్రాజెక్ట్ అయిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ పోయిన అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ కరోనా ఉదృతి కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కానీ ఎన్నో వాయిదాల తర్వాత ఈ జనవరి 7 వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.  అయితే జనవరిలో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా మూడవ వేవ్ స్టార్ట్ అయితే ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ వీటిని మనం ముందే ఊహించి డిసైడ్ చేయలేము. అలాగని ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రాన్ని నెలలు తరబడి వాయిదా వేస్తే అసలుకే మోసం వస్తుంది. మరి ఇటువంటి తరుణంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ సందిగ్ధంలో పడింది. మరి ఈ చిత్రాన్ని కరోనా కరుణిస్తుందో లేదో చూడాలి.
ఏదేమైనా అటు మెగా ఫ్యాన్స్ ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇరువురు కలిసి తమ అభిమాన తారల చిత్రం జనవరిలో చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్ని రకాలుగా అనుకూలించి ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమా కూడా అంతకు పదింతలు ప్రభంజనం సృష్టించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: