అఖండ వారికి మంచి మార్గాన్ని చూపిస్తుందా!

P.Nishanth Kumar
రెండవ లాక్ డౌన్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో రాబోతున్న అతి పెద్ద చిత్రం అఖండ. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా భారీ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. బోయపాటి శ్రీను తో కలిసి నందమూరి బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా కావడంతో గత రెండు చిత్రాలు భారీ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క విజయం తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే పెద్ద చిత్రాల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో తెరకెక్కిన పుష్ప చిత్రం రాబోతుంది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, గని సినిమా లు రాబోతున్నాయి.ఇక జనవరి నెలలో రాజమౌళి దర్శకత్వంలోనీ ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్ల నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ సర్కార్ వారి పాట వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ సినిమాలు గట్టెక్కాలంటే తప్పకుండా అఖండ సినిమా భారీగా ప్రేక్షకాదరణ పొందాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్లే సినిమా అప్డేట్ లు కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతున్నాయి. మంచి మాస్ మసాలా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాతో బాలకృష్ణ కూడా మంచి విజయం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలు చిన్నవే కావడం తో అవి గట్టెక్కాయి. కొన్ని సినిమా లు ఓ టీ టీ లో విడుదల కాగా మరికొన్ని థియేటర్లలో విడుదల అయ్యాయి. అవన్నీ కూడా చిన్న బడ్జెట్ సినిమాలే కాబట్టి పెద్దగా నష్టాలు రాలేదు. కానీ పెద్ద సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తేనే పెద్ద సినిమా కు మంచి కలెక్షన్స్ వస్తాయి.  ఈ నేపథ్యంలో ఈ చిత్రం పెద్ద సినిమాల రాక కి మంచి పునాది వేస్తుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: