హాట్ స్టిల్స్ తో అదరగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ మొనల్ గజ్జర్, నరేష్ హీరో గా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం లో తెరకెక్కిన సుడిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ హాట్ బ్యూటీ మొదటి సినిమా లోనే తన అందంతో, నటన తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ లో అవకాశాలు దక్కలేదు. అయితే మధ్య మధ్యలో చిన్న చితకా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మ కు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ఎనలేని గుర్తింపును, పాపులారిటీ తీసుకువచ్చింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో  ఉండగానే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ కి, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది.

 ఇలా సినిమాలతో ప్రేక్షకులకు టచ్ లో ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా తో కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ, తన సినిమా షూటింగ్ అప్డేట్స్ లను, అలాగే తన డైలీ యాక్టివిటీస్ ను కూడా తెలియజేస్తూ ఉంటుంది,ఇది ఇలా ఉంటే హాట్ బ్యూటీ మొనల్ గజ్జర్ సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్పు డప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కూడా మొనల్ గజ్జర్ ఒక ఫోటో ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో మోనాల్ గజ్జర్ డిఫరెంట్ డ్రెస్ వేసుకొని అదిరిపోయే లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: