ఏం చేద్దాం...? రాజమౌళి తో నిర్మాత చర్చలు...?

Sahithya
దేశవ్యాప్తంగా మరోసారి వైరస్ వ్యాప్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా కంగారు పెడుతున్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తోంది. అగ్రహీరోల సినిమాలన్ని ఉన్న నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏం చేయబోతుందో ఏంటనే దానిపై అటు సినీ వర్గాలతో పాటు ఇటు అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధం కావడం దాదాపు గత రెండు దశాబ్దాలుగా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకోబోతోంది ఏంటి ఏ విధంగా సినిమాలను విడుదల చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో దర్శక నిర్మాతల్లో ఆందోళనను రోజురోజుకూ పెరుగుతోందని ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు చర్చలు ఎక్కువగా జరుపుతూ తమ సినిమాలకు సంబంధించి త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సినిమా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్    కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనే దానిపై క్లారిటీ రావడం లేదు.
సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్న రాజమౌళి ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించారు సరే పరిస్థితులు అనుకూలించే అవకాశాలు కనపడటం లేదని మీడియా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కి కొత్త వైరస్ రూపం అడుగు పెట్టిన నేపథ్యంలో రాజమౌళి నిర్మాత దానయ్య తో చర్చలు జరుపుతున్నారని ఆయన కూడా సినిమా విడుదలను అవసరమైతే వాయిదా వేస్తామని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఈ సినిమా విషయంలో ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో మరోసారి సినిమా విడుదల వాయిదా పడితే మాత్రం పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: