ఆ పాటకు వున్న సీక్రెట్ చెప్పిన ఎన్టీఆర్

murali krishna
సినిమా అన్నాక పాటలు మరియు ఫైట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు . సాంగ్స్ కంపోజ్, పిక్చరైజేషన్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టె దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి ని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణలో స్పెషల్ కేర్ తీసుకుంటారట  మరి అయన దగ్గర శిష్యరికం చేసిన జక్కన్న కూడా అదే బాట ఎంచుకున్నారట.
సినిమాలో అన్ని విభాగాలతో పాటు సాంగ్స్ మీద కూడా జక్కన్న ఎక్కువ దృష్టి పెడతాడని బాహుబలి తర్వాత జక్కన్న తెరెకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ అంచనాలతో, భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటోందట.కరోనా వలన జాప్యం అయిన ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిందని ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.
ఇక ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ కి వీరలెవెల్లో రెస్పాన్స్ వచ్చిందట  . సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన ఈ సాంగ్ కి అనుగుణంగా చాలా మంది చిందులు వేస్తూ నెట్టింట హల్ చల్ చేసారని తెలుస్తుంది.అసలే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ తో పాటు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందఅని తెలుస్తుంది.
అందుకే అంచనాలు అందడం లేదట దానికి తోడు ఈ మూవీ ఊరమాస్ మ్యూజిక్ తో నాటు నాటు వీర నాటు సాంగ్ లో తారక్, చరణ్ స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారట.. ఈ సాంగ్ లో కాళ్ళు ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉంటాయట ఈ స్టెప్స్ పర్‏ఫెక్ట్ గా రావడానికి చరణ్, తారక్ 15-18 టేక్స్ తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పాడు. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం రాజమౌళి నరకం చూపించాడని మరియు , తమ స్టెప్పులు కరెక్ట్ గా వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో డాన్స్ ఆపేసేవాడని దాదాపు 18 టేక్స్ తీసుకున్న తర్వాత ఒకే చెప్పారని  ఇక పాట రిలీజ్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, జక్కన్న ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్ట్ అయ్యాడని అనిపిస్తోందని తారక్ వివరించాడట.. ఆడియన్స్ నాడి పట్టుకోవడంలో జక్కన్న దిట్ట అని తారక్ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేసాడట
. ఇక ఈ సాంగ్ రిలీజయ్యాక క్షణాల్లో యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: