ఈ పెయిర్స్ వల్లే సినిమా లు హిట్ అయ్యాయా!!

P.Nishanth Kumar
ఏదైనా సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే తప్పకుండా ఆ చిత్రంలోని ఏదో ఒక అంశం ప్రేక్షకులను బాగా నచ్చాలి. లేదంటే వారికి ఆ సినిమా ఏ మాత్రం ఎక్కద . ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథైనా బాగుండాలి.  దర్శకత్వం అయినా బాగుండాలి. లేదంటే హీరో అయిన ప్రేక్షకులకు బాగా నచ్చాలి. లేదంటే ఫైనల్ గా హీరోయిన్ హీరో కాంబినేషన్ అయినా చాలా బాగుండాలి. లేదంటే సదరు చిత్రం హిట్ అవదు. ఇటీవలే హీరో హీరోయిన్ ల కాంబో సినిమాలు హిట్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం ఉప్పెన అంత పెద్ద సూపర్ హిట్ అయిందంటే అది కేవలం వీరిద్దరి కాంబినేషన్ చూసే అని చెప్పాలి. వీరు ప్రధాన పాత్రలో నటించగా వీరి మధ్య కెమిస్ట్రీ బాగా పండడం తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆ రేంజ్ లో ప్రేక్షకులు మెచ్చిన జంట నాగచైతన్య మరియు సాయి పల్లవి. వీరు ఇద్దరు కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటించగా ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించింది అంటే వీరి కాంబినేషన్ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. 

ఇక రాఘవేంద్రరావు సమర్పణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ అలాగే శ్రీవల్లి నటించిన పెళ్లి సందడి సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరవడానికి కారణం ఈ జంట మాత్రమే. అక్కినేని అఖిల్ పూజా హెగ్డే లు కలిసి తొలిసారిగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది అంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండడం అని చెప్పాలి. ఇక ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో హీరో హీరోయిన్ లు గా నటించి ఆ చిత్రం అంత పెద్ద విజయం అవడానికి కారణం అయ్యాడు హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సుధీర్ బాబు మరియు ఆనంది ప్రేక్షకులను మంచి కిక్ ఇచ్చిన జంట అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: