షాకింగ్: రాజమౌళి ఇలా చేస్తారు అని ఎవ్వరు ఊహించలేదే..!!
సినిమాని తెరకెక్కించడంలోనే కాదు ఆ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం లోను రాజమౌళి స్టైల్ వేరేలా ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన అన్నీ పాటలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యం గా "నాటు నాటు" పాట అయితే అదుర్స్ అని అంటున్నారు. చరణ్ , తారక్ మాస్ స్టెప్పులు ఈ పాటకి పెద్ద ప్లస్ గా మారాయి. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ లోకి వెళ్లి నాటు నాటు కవర్ సాంగ్స్ అని టైప్ చేయండి. బాబోయ్ కొన్ని వేల సాంగ్స్ మనకు కనిపిస్తాయి. అంత బాగా రీచ్ అయ్యింది ఈ పాట జనాలకి. ఇక ఈ సినిమా నుండి రీసెంట్గా రిలీజ్ అయిన సోల్ సాంగ్ ‘జనని’. ఈ పాట విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది.
ఈ పాటను రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య.. తమిళ వెర్షన్ను విడుదల చేశారు. కాగా “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు ఈ పాట లాంచింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు. చెన్నై లో జరిగిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి కోలీవుడ్ సినీ మీడియా సోదరులకు సారీ చెప్పారు. గత 3 సంవత్సరాలుగా వాళ్లతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు జక్కన్న క్షమాపణలు తెలియజేసారు. జనవరిలో సినిమా రిలీజ్ కు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్లో ఖచ్చితంగా వారితో మాట్లాడుతానని రాజమౌళి వారికి ప్రామిస్ కూడా చేసారు.