ప్రభాస్ సినిమాలో నూతన నటీనటులు !

Seetha Sailaja
సాధారణంగా టాప్ హీరోల సినిమాలలో నూతన నటీనటులకు అవకాశాలు ఇవ్వరు. మరీ ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన నూతన నటీ నటులను ఎవరు పట్టించుకోరు. దీనితో వారికి ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ వారిని గుర్తించే వారుండరు. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీయబోతున్న మూవీ నటీనటుల విషయంలో తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

హాలీవుడ్ సినిమాలలో పాత్రకు సరిపోతే 80 సంవత్సరాల వయసు వారికి కూడ అవకాశాలు ఇస్తారు. గత సంవత్సరం హాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఆస్కార్ అవార్డు పొందిన నటుడుకి 80 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇలాంటి విషయాల నుండి స్ఫూర్తి పొంది నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

ఈసినిమాకు సంబంధించి ఒక క్యాస్టింగ్ కాల్ వచ్చింది. ‘హైదరాబాదీలు ఇప్పుడు మీ వంతు త్వరపడండి భవిష్యత్తును ఫేస్ చేయడానికి సిద్ధపదండి' అని ప్రకటన ఇచ్చారు. ఈసినిమాలో నటించడానికి
ఆసక్తి ఉన్న 50 -70 ఏళ్ల పురుషులు మహిళలు తమ ప్రొఫైల్ ను ఆడిషన్ వీడియోని నిర్మాణ సంస్థ అధికారిక మెయిల్ కు పంపవలసిందిగా ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 9-14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు 20-35 ఏళ్లున్న ఎనర్జిటిక్ డ్యాన్సర్స్ జిమ్నాస్టిక్ లో ప్రావీణ్యం ఉన్న వారికీ క్యాస్టింగ్ కాల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సోషియో ఫాంటసీ జోనర్ లో తీయబడుతున్న ఈ మూవీని విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ప్రారంభం అయిన ఈమూవీ రెండవ షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతోంది. డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈమూవీని అనేక విదేశీ భాషలలో కూడ విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీపిక పదుకొని హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ విజయవంతం అయితే ప్రభాస్ ఇంటర్ నేషనల్ స్టార్ గా మారిపోయే ఆస్కారం ఉంది అని అంచనా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: