భీమ్లా నాయక్ సినిమాకు మొదటగా ఆ టైటిల్ ను అనుకున్నారట..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను ఒకే చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు లైన్ లో పెడుతూ వస్తున్నా, ప్రస్తుతం మాత్రం భీమ్లా నాయక్ సినిమా మీదనే  ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమా కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్, పాటలను చిత్ర బృందం బయటకు వదలగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

 భీమ్లా నాయక్ మూల కథ మలయాళ సినిమాదే అయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. సెట్స్ పైకి వెళ్ళకముందే ముందే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అసుర సంధ్య వేళ‌లో అనే టైటిల్ ను పెట్టాలి అనుకున్నారట. దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలకు ఎక్కువ శాతం అ అనే అక్షరంతో సినిమా టైటిల్ మొదలవుతు ఉంటాయి. ఉదాహరణకు అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం లో, అరవింద సమేత, అ ఆ అలాగే ఈ సినిమాకు కూడా అసుర సంధ్య వేళలో అనే టైటిల్ ని పెడదాము అని అనుకున్నారట. అయితే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్‌ కు అంతగా క‌నెక్ట్ కాదేమోన‌ని నిర్మాత‌లు భావించటం తో చివ‌ర‌కు ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: