కత్రినా, విక్కీ పెళ్లికు ముహూర్తం ఫిక్స్... ఇదే డేట్ ?

Vimalatha
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం గురించి చాలా రోజుల నుంచి ఇప్పటికీ చాలా వార్తలు వస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు పెళ్లి వార్తలను కొట్టిపారేస్తారు. కొన్నిసార్లు వారి వివాహం ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువగా మాట్లాడుకునే వార్తలలో ఈ ఇద్దరు తారల పెళ్లి వార్త ఒకటి. వీరి పెళ్లి తేదీ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట పెళ్లి తేదీని సన్నిహితులు వెల్లడించారు. ఈ హాట్ జంట పెళ్లి తేదీని నిర్ధారించారు. డిసెంబర్ 9న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఫోర్ట్ బార్వారా అనే రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుంది. కత్రినా కైఫ్‌కి సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. డిసెంబర్ 9న హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాహ వేడుకకు వీరిద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు కానున్నారు. డిసెంబర్ 7వ తేదీ మరియు 8వ తేదీల్లో రాజస్థాన్‌లో సంగీత్, మెహందీ వేడుకలు జరుగుతాయి.
బంధువులు నిరాకరిస్తున్నారు
విక్కీ, కత్రినా తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తలూ పబ్లిక్‌గా రాకూడదని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వివాహం గోప్యంగా జరగాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ఇద్దరి బంధువులు కూడా మీడియాతో మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు. ఇటీవల విక్కీ కజిన్ సోదరి కూడా ఒక రూమర్‌ ను కొట్టిపారేస్తూ పెళ్లి వార్తను చెప్పింది. విక్కీ, కత్రినా పెళ్లి చేసుకోలేదని, ఇలాంటివి జరిగి ఉంటే అందరికీ తెలిసి ఉండేది కదా అంటూ ఇప్పటికే కత్రినాకు విక్కీతో పెళ్ళై పోయింది అనే విషయాన్నీ కొట్టి పారేశారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ వివాహ సంబంధ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
పలువురు ప్రముఖులు చేరినట్లు వార్తలు వస్తున్నాయి
ఈ పెళ్లికి హాజరయ్యే అతిథుల గురించి కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వివాహానికి దాదాపు 200 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వివాహ సంగీత వేడుక, మెహందీ వేడుకకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ పెళ్లికి హాజరైన ప్రముఖుల పేర్లతో కూడిన లిస్ట్ వచ్చింది. ఆ పేర్లలో సల్మాన్ ఖాన్ పేరు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: