హాట్ న్యూస్ గా మారిన మహేష్ బాబు కొత్త వ్యాపారం !

Seetha Sailaja
టాప్ హీరోలు కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటున్నారు. అయితే తమ కెరియర్ ఇలా ఎంతకాలం నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందో అన్న సందేహాల మధ్య ఈమధ్య టాప్ హీరోలు అంతా పెద్ద పెద్ద బిజినెస్ లలోకి ఎంటర్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ మల్టీ ఫ్లెక్స్ ధియేటర్స్ ఓటీటీ వ్యాపారాలతో పాటు సొంత ప్రొడక్షన్ హౌస్ లను కూడ ఏర్పాట్లు చేసుకుని చాల ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా ప్రారంభించబోతున్న ఒక కొత్త వ్యాపారం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గత సంవత్సరం లాక్ డౌన్ పరిస్థితులలో ఆన్ లైన్ చదువులకు డిమాండ్ బాగా పెరిగింది. మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడ ఆన్ లైన్ చదువులకు అలవాటు పడ్డారు.

ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఎన్నో ఎడ్యుకేషనల్ యాప్స్ వచ్చాయి. వీటిలో ‘బైజూస్’ ఒకటి.  ఈ బైజూస్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పోలికలతో ఉన్న ఒక దే లెర్నింగ్ యాప్ ప్రారంభించే ఆలోచనలలో మహేష్ బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేజీ విద్యార్థుల నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు అందరికీ పనికొచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే ఒక యాప్ ను తీసుకొచ్చే ఆలోచనలలో మహేష్ ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇలాంటి వ్యాపారాలు మహేష్ కు కొత్త అయినప్పటికీ ఈ వ్యాపారాలలో అనుభవం ఉన్న ఒక వ్యక్తితో కలిసి మహేష్ ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ సొంతంగా జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. అంతేకాదు నమ్రత ‘ది హంబుల్’ అనే డిజైనర్ వేర్ బిజినెస్ కూడా చేస్తోంది. ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ పేరిట మహేష్ నిర్వహిస్తున్న మల్టీప్లెక్స్ బిజినెస్ ఇప్పుడు ఆంధ్రా ప్రాంతంలోని విశాఖపట్నం విజయవాదలలోకి ఎంటర్ కాబోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: