దుల్కర్ సల్మాన్ రేంజ్ ని అందుకోవడంలో ఆర్ ఆర్ ఆర్ పుష్ప కు ఆటంకాలు !

Seetha Sailaja
మళయాళ టాప్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఆమూవీ ఇప్పటికే 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను సాధించి ఇండస్ట్రీ హిట్ గా మారింది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను దుబాయ్ లో నిర్వహించి ఈ మూవీ యూనిట్ సభ్యులు అంతా ఆ ఫంక్షన్ కు హాజర్ అయ్యారు.

దుబాయ్ లో ఎక్కువగా మళయాళీలు ఉంటారు కాబట్టి వారి దృష్టిలో ఈమూవీకి మంచి క్రేజ్ తీసుకు రావడానికి ఇలాంటి వ్యూహాన్ని అమలు పరిచారు. వాస్తవానికి ఇలాంటి వ్యూహాలే అనుసరించాలని ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ అదేవిధంగా ‘పుష్ప’ టీమ్ కూడ భావించడంతో దుబాయ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ను చాల ఘనంగా నిర్వహించారని భారీ స్కెచ్ లు వేసారు.

దుబాయ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి నిర్వహించే ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సల్మాన్ ఖాన్ ను కూడ పిలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్స్ అన్నీ వాయిదా పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ ఈవెంట్స్ కు అవుతున్న భారీ ఖర్చు అని అంటున్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ ‘పుష్ప’ మూవీలకు సంబంధించిన ఆంధ్రా ప్రాంతపు హక్కులను అక్కడ కొనసాగుతున్న టిక్కెట్ల వివాదం రీత్యా తక్కువ రేట్లకు అమ్మడంతో ఈమూవీ నిర్మాతలకు ఆశించిన లాభాలు రాలేదని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈ వెంట్స్ ను భారీ ఖర్చుతో దుబాయ్ లో నిర్వహిస్తే ఆ ఖర్చులు నిర్మాతలకు అదనపు బారం అవుతుందని భావించి ఆ ఈవెంట్స్ ను వాయిదా వేసి ముంబాయ్ లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ విశాఖపట్నం ప్రాంతాలతో పాటు దేశంలోని కొన్ని ముఖ్యనగరాలలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించాలని నిర్మాతల ఆలోచన అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: