ఆర్ఆర్ఆర్ కోసం ఒకటి కాదు అనేకం ... ??

GVK Writings
తొలిసారిగా టాలీవుడ్ స్టార్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామ రాజుగా యాక్ట్ చేస్తుండగా వారిద్దరికీ జోడీగా బాలీవుడ్ నాయకి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ యాక్ట్ చేస్తున్నారు. డివివి దానయ్య ఎంతో భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా విజయేంద్ర ప్రసాద్ కథని, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి ని అందిస్తున్నారు.
ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన చరణ్ ఎన్టీఆర్ ల ఫస్ట్ లుక్ టీజర్స్ తో పాటు దోస్తీ, నాటు నాటు, జనని సాంగ్స్ అన్ని కూడా ఆర్ఆర్ఆర్ పై అందరిలో విపరీతంగా అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. ముఖ్యంగా నేడు రిలీజ్ అయిన జనని సాంగ్ ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఒకేసారి తారాస్థాయికి తీసుకువెళ్లింది. ఇక ఈ సినిమాలో ఆకట్టుకున్న భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో పాటు కమర్షియల్ హంగులు, అలరించే విజువల్స్, ఫైట్స్ వంటివి సినిమాలో ఆడియన్స్ ని చూపు తిప్పుకోనివ్వవని, అలానే తామందరికీ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి అని నేడు జనని సాంగ్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి మీడియా సమావేశంలో తెలిపారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తాం అని చెప్పిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ కోసం చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇండియా లోని పలు ప్రధాన ప్రాంతాల్లో ప్లాన్ చేసాం అని, తప్పకుండా అందరికీ చేరువ అయ్యేలా సినిమా యొక్క పబ్లిసిటీ నిర్వహిస్తాం అని ఆయన అన్నారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే జనవరి 7న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీ నిలిచిపోయేలా అద్భుతంగా సక్సెస్ సాధించి భారీ రికార్డ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు పలువురు ప్రేక్షకాభిమానులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: