దానికోసం విపరీతంగా కష్టపడుతున్న చరణ్ ... ??

GVK Writings
ఇప్పటికే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చేస్తున్న ఆచార్య తో పాటు తనకు మంచి మిత్రుడైన ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. కాగా వీటిలో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుండగా ఆచార్య ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీటి అనంతరం ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తో కలిసి చరణ్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల పుణేలో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని కొన్ని లోపాలను బయట పెడుతూ సాగే మూవీ గా తెరకెక్కుతోందని టాలీవుడ్ వర్గాల టాక్. చరణ్ ఇందులో ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారికగా కనిపించనుండగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు ఒకరు ఇందులో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఇప్పటికే ఎంతో ఫిట్ గా రెడీ అయిన రామ్ చరణ్, రాబోయే రోజుల్లో మరింతగా తన బాడీ విషయంలో శ్రద్ధ తీసుకోనున్నారని, సినిమాలో పాత్ర కోసం చరణ్ ఇంతలా కష్టపడడం చూస్తుంటే తప్పకుండా అతడు ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడంతో పాటు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారట.
ఆకట్టుకునే యాక్షన్, కమర్షియల్ అంశాల కలబోతగా అలానే పలు మాస్ సీన్స్ కూడా జోడించి దర్శకుడు శంకర్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్ తో పాటు అటు యావత్ తెలుగు ఆడియన్స్ అందరి లో కూడా భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: