అఖండ లో అంతకు మించే ఉంటుందట .... ??

GVK Writings
టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా అఖండ. శ్రీకాంత్ విలన్ గా చేసిన ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఆయన రెండు లుక్స్ తాలూకు టీజర్స్, అలానే విడుదలైన సాంగ్స్ తో పాటు కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా అఖండ పై అందరిలో అఖండమైన అంచనాలు ఏర్పరిచాయి అనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చారు.
ఇక ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుండగా తమ హీరో తప్పకుండా దీనితో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని బాలయ్య ఫ్యాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖండ లో అద్భుతమైన యాక్షన్, మాస్ సన్నివేశాలు ఉన్నాయని, అలానే కథతో పాటే అంతర్లీనంగా సాగె ఎమోషన్స్ అందరి మదిని తాకుతాయని సమాచారం. ముఖ్యంగా గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనకు అందరికీ తెలిసిందే.
అయితే వాటిని మించేంతగా ఈ సినిమాలోని సీన్స్ ని మరింత అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. మరోవైపు ఇటీవల అఖండ చూసిన సెన్సార్ సభ్యులు సినిమాపై మంచి రెస్పాన్స్ అందించడంతో అఖండ పై మరింత అంచనాలు పెరిగాయి. మొత్తంగా మంచి అంచనాలతో మరొక వారంలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న అఖండ మూవీ సూపర్ హిట్ కొట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: