2022 ప్రేక్షకులకు మెగా ట్రీట్.. సినిమాలే సినిమాలు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో మెగా హీరోలకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. మిగతా అందరికీ ఎంతమంది అయితే అభిమానులు ఉంటారో ఒక మెగా కుటుంబానికి అంత మంది అభిమానులు ఉండటం మనం చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి బాట లో ఎంతో మంది హీరోలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి తమని తాము నిరూపించుకోగా ఇప్పుడు మెగా హీరోలు గా కొనసాగుతున్నారు.  ఆ విధంగా దాదాపు అరడజను మంది మెగా హీరోలు ఉండగా వారు కొన్ని వందల మందికి వారు పని కల్పిస్తూ వారి జీవనానికి ఉపయోగపడుతూ ఉన్నారు.

నేపోటిజం అనే విమర్శలు వచ్చినా బయట వాదనలు జరుగుతున్న కూడా అవేమి పట్టించుకోకుండా మెగా హీరోలు ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ విధంగా వచ్చే ఏడాది మన మెగా హీరోల దగ్గర నుంచి ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు వస్తున్నాయి. దాంతో వచ్చే ఏడాది మెగాహీరోలు గట్టిగానే అలరించబోతున్నారు అని ప్రేక్షకులు సంబర పడుతున్నారు.

ఆ విధంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమా లెంటో ఇప్పుడు చూద్దాం. జనవరి 7వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిపోతున్నాడు. ఆ తర్వాత నెలలోనే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. చిరు గాడ్ ఫాదర్ , భోళా శంకర్ కూడా అదే ఏడాది చేయబోతున్నాడు. ఇక వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు కూడా తమ సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు.  ఇలా వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అందరూ మెగా హీరోలు. పవన్ కళ్యాణ్ కూడా తన చిత్రాలను వచ్చే ఏడాదిలోనే తీసుకురాబోతున్నాడు. అల్లు అర్జున్ కూడా వచ్చే ఏడాది పుష్ప 2 ఈ విధంగా వచ్చే ఏడాది సంబరాలు నెలకు ఒకటి జరుపుకోవచ్చు అన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: