మొదటి సినిమాతోనే మైమరపించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్..

NIKHIL VINAY
సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అటువంటి దర్శకులలో తరుణ్ భాస్కర్ దాస్యం ఒరు . తరుణ్ భాస్కర్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో విడుదలైన పెళ్లి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడు గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ముందు నుంచే మంచి స్నేహితులు కావడంతో నిర్మాత రాజ్ కందుకూరి నీ కలిసి మొదటి సినిమా అవకాశాన్ని కొట్టేశారు.

పెళ్లిచూపులు ఈ సినిమా విజయ్ దేవరకొండ, రీతువర్మ కాంబినేషన్లో 2016 లో విడుదలైంది. రొమాంటిక్ కామెడీ తెలుగు సినిమా ఇది. వీరిద్దరూ పెళ్లి చూపులలో కలవడంతో ఈ సినిమా ప్రారంభమై వీరిద్దరి మధ్య కథ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు తరుణ్ భాస్కర్ . ఈ సినిమాకు ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక, ఉత్తమ మాటలు, రచయితగా కూడా తరుణ్ భాస్కర్ కి జాతీయ పురస్కారం దక్కింది. మొదటి సినిమాకు జాతీయ పురస్కారం దక్కడం ఎంతో గొప్ప విషయం. విజయ్ దేవరకొండకు హీరోగా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా.

దర్శకుడు తరుణ్ భాస్కర్ 1988 నవంబర్ 5న చెన్నై లో జన్మించారు. కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. మొదటి నుంచి కూడా తరుణ్ భాస్కర్ కు దర్శకుడు కావాలనే ఆసక్తి ఉండేది. దానితో ఆయన మొదట గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టారు. తల్లి రాసిన ఒక కవితను మొదటి షార్ట్ ఫిలిం గా తీసి మద్రాస్ లో జరుగుతున్న సారంగ్ అనే ఉత్సవాలకు పంపాడు, దానికి అక్కడ బహుమతి కూడా వచ్చింది. ఆ తర్వాత తను తీసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిలిం ఫెస్టివల్ లాంటి చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయి. జూనూన్ అనే షార్ట్ ఫిలిం కు పీపుల్స్ ఛాయిస్ అనే అవార్డు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: