'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ కి ప్రభాస్ వస్తాడా..?

Anilkumar
పాన్ ఇండియా హీరోగా ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి పాపులారిటీ  ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో సైతం ప్రభాస్ సినిమాలకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంటాయి. అయితే ఒక రకంగా ప్రభాస్ కి ఎంత ఇమేజ్ని కట్టబెట్టింది మన రాజమౌళి అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తోనే ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో లను మించి రెమ్యునరేషన్ని తీసుకుంటున్నాడు. అటు నిర్మాతలు కూడా ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రభాస్ ఇతర హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషన్లో పాల్గొంటూ ఆ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతున్నాడు. ఇక ప్రభాస్ వల్ల సినిమాకి హైప్ బాగా వస్తుండడంతో మిడిల్ రేంజ్, చిన్న హీరోలు తమ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ప్రభాస్ ని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా ప్రభాస్ ని రంగంలోకి దింపితే బాహుబలి క్రేజ్ అనేది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు యాడ్ అవుతుంది. మరో వైపు వచ్చే సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ తో పాటు రాధేశ్యామ్ కూడా ఒక వారం గ్యాప్ లోనే విడుదల అవుతుంది. ఇక రాజమౌళి-ప్రభాస్ సినిమాలు ఒకే టైం లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో..

 ప్రభాస్ కనుక త్రిబుల్ ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తే అది కాస్తా తన రాధేశ్యామ్ సినిమాపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కారణం వల్లే అటు రాజమౌళి కూడా ఇప్పటివరకు ప్రభాస్ని త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ కి పిలవ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి కనుక కోరితే ప్రభాస్ ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తాడు. కానీ ఇప్పటివరకు రాజమౌళి మాత్రం ప్రభాస్ ని పిలవలేదు. మరి ముందు ముందు జరిగే ప్రమోషన్స్ లోనైనా రాజమౌళి ప్రభాస్ ని పిలుస్తారేమో చూడాలి. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కి ప్రభాస్ కూడా యాడ్ అయితే సినిమాకి హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: