హాలీవుడ్‌‌లోకి సమంత..! ఏ పాత్రనో తెలుసా..?

N ANJANEYULU
ఇటీవ‌లే అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన స‌మంత త‌న ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతుంది. ఇప్ప‌టికే తెలుగుతో పాటు త‌మిళం త‌దిత‌ర భాష‌ల్లో న‌టించిన స‌మంత‌ అంత‌ర్జాతీయంగా మెప్పించేందుకు సిద్ధం అయింది. ఓ ఇంగ్లీషు సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమాను ప్ర‌ముఖ ర‌చ‌యిత తిమేరి ఎన్‌.మురారి న‌వ‌ల ద అరెంజ్మెంట్స్ ఆఫ్ ల‌వ్ ఆదారంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడు. స్వ‌యంగా స‌మంత‌నే ఈ విష‌యాన్ని  తన ట్విట్ట‌ర్ వేధిక‌గా వెల్ల‌డించింది.
యూకేకు చెందిన స్టార్ దర్శకుడు ఫిలిప్ జాన్ 'డౌన్టౌన్ అబ్బే' లాంటి హిస్టరీ డ్రామాతో ప్రేక్షకుల్ని ఎంత‌గానో మెప్పించారు. నెట్‌ప్లిక్స్‌లో  ఈ సిరీస్ ఉన్న‌ది. ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే  నూత‌న సినిమాలో సమంత‌కు ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల  ద‌ర్శ‌కుడు ఫిలిప్ చెన్నై వచ్చినప్పుడు ఆయనను సమంత కలిసింది. అయితే ఈ సినిమాలో సమంత స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించనున్న‌ద‌ని టాక్‌. 2009లో 'ఏ మాయ చేశావే' కోసం ఆడిషన్స్ ఇచ్చాను.  మళ్లీ 12 ఏండ్ల తరువాత మరొక‌సారి ఆడిషన్ ఇచ్చానని ట్విట్ట‌ర్‌లో గుర్తు చేసింది సామ్‌. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే అనిపించింది అని.. అను పాత్ర కోసం నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ ఫిలిప్ జాన్ సర్ అని సమంత ట్వీట్ పోస్ట్  చేసింది.
ఈ చిత్రంలో 27 ఏండ్ల స్ట్రాంగ్ మైండెడ్‌, ఫ‌న్నీ మ‌హిళ‌గా స‌మంత న‌టించ‌నున్న‌ది. సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీ న‌డిపే అను అమ్మాయిగా క‌నిపించ‌నున్న‌ది స‌మంత‌. స్వ‌లింగ సంప‌ర్కురాలు అయిన‌ప్ప‌టికీ త‌న త‌ల్లిదండ్రుల మాట‌కు విలువను ఇచ్చి పెళ్లికి సిద్ధం అయ్యే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా త‌న కెరీర్‌ను మొద‌లెట్టిన స‌మంత‌.. ఆ త‌రువాత త‌మిళంలోనూ ప‌లు చిత్రాల‌లో న‌టించిన‌ది. ఇప్ప‌టికే  తెలుగు, త‌మిళంలో అగ్ర హీరోయిన్‌గా ఓ గుర్తింపు కూడా తెచ్చుకుంది. గ‌త సంవ‌త్స‌రం ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజీగా ప్ర‌తినాయ‌క ల‌క్ష‌ణాలు ఉన్న పాత్ర‌లో అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ప‌లు విభిన్న అవ‌కాశాలు త‌లుపు త‌డుతూనే ఉన్నాయి. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ రావ‌డంతో స‌మంత సంతోషం వ్య‌క్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: