డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Divya
నాగ్ అశ్విన్ గా పరిచయమైన ఈ దర్శకుడు అసలు పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. భారతీయ సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన స్క్రీన్ రైటర్ గా కూడా తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకున్నారు. హైదరాబాదులో ప్రముఖ వైద్యులు జయరామిరెడ్డి, జయంతి దంపతులకు జన్మించిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులు కావడంతో అదే రంగంలోనే కొనసాగాలని అనుకున్నాడు. ఇకపోతే తన విద్యాభ్యాసం విషయానికి వస్తే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఈయన మాస్ కమ్యూనికేషన్.. జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తిచేశాడు.
ఇక కాలేజ్ డేస్ లో చదువుకునే సమయంలో బాగా కథలు కూడా రాసేవారు. ఇక అవి చూసిన ఆయన స్నేహితులంతా ఎలాగైనా సరే రైటర్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టమని ప్రోత్సహించారట.అలా  పుట్టుకొచ్చిన ఆలోచనే దర్శకుడిని చేసింది. మొదట చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగ అశ్విన్ రెడ్డి సహాయ దర్శకునిగా పనిచేశారు.. మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా నేను మీకు తెలుసా..? ఈ సినిమా ద్వారా మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఆ తరువాత ప్రముఖ ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర లీడర్ , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన శేఖర్ కమ్ముల దగ్గర డైరెక్షన్ కి కావాల్సిన అన్ని మెళకువలను తెలుసుకున్నాడు. మొదటిసారి నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా రచయితగా , దర్శకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి 2015లో పరిచయం అయ్యాడు. ఇక తర్వాత మహానటి సావిత్రి లాంటి గొప్ప కథానాయిక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో ఆయనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

తాజాగా ఈ సంవత్సరం జాతిరత్నాలు సినిమాతో నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఇంగ్లీష్ లో యాదొమ్ కీ బరాత్  అనే షార్ట్ ఫిలిం ద్వారా మొదటిసారి రచయితగా , దర్శకుడిగా పనిచేశారు. మూడు చిత్రాల ద్వారానే అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు నాగ్ అశ్విన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: