ఎఫ్ 3 రహస్యాలను బయటపెట్టిన అనీల్ రావిపూడి !

Seetha Sailaja

దర్శకుడు అనీల్ రావిపూడి కి ఇప్పటివరకు పరాజయం అన్నది ఎరుగడు. జంధ్యాల తరువాత ఆయన మార్క్ కామెడీ తో సినిమాలు తీయగలిగిన సత్తా ఒక్క అనీల్ రావిపూడికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇతడు దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్ 3’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంక్రాంతి సినిమాల హడావిడి తరువాత ఫిబ్రవరిలో ‘ఎఫ్ 3’ హంగామా మొదలుకాబోతోంది. దీనితో ఇప్పటి నుంచే ఈసినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ ఈ మూవీ పై అంచనాలు పెంచడానికి అనీల్ రావిపూడి ప్రయత్నిస్తున్నాడు. ‘ఎఫ్ 2’ కథకు ‘ఎఫ్ 3’ కథకు ఎటువంటి సంబంధం ఉండదు  అని చెపుతూ ‘ఎఫ్ 2’ లో నటించిన నటీనటులు అంతా ‘ఎఫ్ 3’ లో నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ సీక్వెల్ అన్న భావన కలుగుతుందని లీకులు ఇస్తున్నాడు.

అంతేకాదు ఈమూవీలో హీరోలుగా నటిస్తున్న వెంకటేష్ కు రేచీకటి ఉంటుందని అదేవిధంగా మరొక హీరో వరుణ్ తేజ్ కు నత్తి ఉంటుందని అయితే వారి లోపాలు బయటపడకుండా వారు పడే పాట్లు ఈ సినిమా చూసినవారికి తెగ నవ్వును తెప్పిస్తాయి అని అంటున్నాడు. అంతేకాదు డబ్బు కోసం ఈ సినిమా హీరోలు పడే పాట్లు మరింత నవ్వును తెప్పిస్తాయని అంటున్నాడు. వాస్తవానికి ఈమూవీ కథలో మూడవ హీరో అవసరం లేకపోయినప్పటికీ మార్పు కోసం సునీల్ పాత్రను క్రియేట్ చేసాను అంటున్నాడు.

ఈమూవీలో రాజేంద్రప్రసాద్ సునీల్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈమూవీకి హైలెట్ గా మారుతాయని ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంతా ఒకనాటి జంధ్యాల సినిమాలను గుర్తుకు చేసుకోవడం ఖాయం అని అంటున్నాడు. ఇక తాను బాలకృష్ణ తో తీయబోయే మూవీ కూడ చాల డిఫరెంట్ గా ఉంటూ ప్రేక్షకులకు కొత్త బాలయ్యను పరిచయం చేయబోతున్న విషయాన్ని వివరించాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈమూవీకి అత్యంత భారీ బిజినెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: