ఈ చిత్రాలు మ్యూజికల్ గా హిట్... కానీ

VAMSI
ఒక సినిమాకి ఇనిషియల్ ప్రమోషన్ సాంగ్స్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక సినిమాకి సంబందించి పాటలు రిలీజ్ అవుతుంటే ఆ సంగీతం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా సినిమాపై అంచనాలు పెరుగుతాయి. కానీ కొన్ని సినిమాలు సాంగ్స్ సూపర్ హిట్ అయినా అంచనాలకు భిన్నంగా సినిమా మాత్రం ఫట్ అవుతుంది. అప్పుడు పాటలు విని ఏవో అంచనాలతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం...అన్ని నిజమవుతాయా ఏంటి..?? అని సర్ది చెప్పుకుంటాడు. అయినా నచ్చిన పాటలు మాత్రం ప్లే లిస్ట్ లో ప్లే అవుతూనే ఉంటాయి. అంతగా మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది. అలా పాటలు హిట్ అయ్యి ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలు. అలాగే ఆ చిత్రాలకు సంగీత దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
* మొదటగా గుర్తొచ్చేది రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఆరెంజ్' మూవీ. ఈ సినిమాలో కంటెంట్ ఫుల్ గా ఉన్నా ఆడియన్స్ కి ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిలువ లేకపోయింది. కానీ ఈ చిత్రంలో ఒకటి, రెండు కాదు ప్రతి పాట హైలెట్...మ్యూజిక్ కి జై కొట్టు అన్నట్టుగా ఉంటాయి. మనం ఏ మూడ్ లో ఉన్నా ఆ మూడ్ కి తగ్గ ప్రతి పాట ఈ సినిమాలో ఉండటం స్పెషల్.  ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎంతో ఫ్రెష్ గా వింటుంటాం. ఈ చిత్రంలోని పాటలు అన్నీ మంచి హిట్ ను అందుకున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకులు హరీష్ జయ్ రాజ్. ఈయన తమిళ సంగీత దర్శకుడు.
* రవితేజ మూవీస్ నీ కోసం, నా ఆటోగ్రాఫ్ చిత్రాలు మ్యూజికల్ గా మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ సినిమాలు మాత్రం నిరాశను మిగిల్చాయి. 'నీకోసం' సినిమాకి దేవి శ్రీ ప్రసాద్, నా ఆటోగ్రాఫ్ మూవీ కి ఎమ్.ఎమ్.కీరవాణి లు సంగీత దర్శకులుగా వ్యవహరించారు.
* అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీ కూడా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. కానీ సినిమా అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
* ప్రభాస్ హీరోగా వచ్చిన 'పౌర్ణమి'. సినిమా పాటలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి కానీ సినిమా మాత్రం హిట్ కాలేదు. ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకులు డిఎస్పి నే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: