సంగీత దర్శకుడు సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?

VAMSI
రాసిన పాటలు మనసుకు చేరువ అవ్వాలంటే దానికి చక్కటి సంగీతం తోడవ్వాల్సిందే. అసలు చాలా పాటలు మన ఫేవరెట్ లిస్ట్ లో ముందుంటాయి. కానీ కనీసం అవి ఏ సినిమాలోవి అని కూడా మనకు తెలిసి ఉండక పోవచ్చు. పాటల వల్ల సినిమాలు హిట్ అవడం, సినిమా ఫ్లాప్ అయినా పాటలు హైలెట్ అయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇక మన సౌత్ లో టాప్ సంగీత దర్శకులు గురించి వస్తే... దేవి శ్రీ ప్రసాద్, థమన్, మణి శర్మ, అనూప్ రూబెన్స్, అనిరుధ్ వంటి వారు చాలామందే ఉన్నారు. అయితే వారు ఒక్కో సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉండనే ఉంటుంది.
కాగా ఇపుడు కొందరు స్టార్ సౌత్ సంగీత దర్శకులు కొందరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసుకుందాం. ఇవి సినీపరిశ్రమ నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం సేకరించినవి.
*స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ. ఆర్.రహమాన్ సినిమాను బట్టి దాదాపు 5 కోట్లు వరకు పారితోషకం తీసుకుంటారని సమాచారం.
*రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒక్కో చిత్రానికి 1.5 కోట్ల నుండీ 2 కోట్లు వరకు అందుకుంటారట.
*సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ  0.75 కోట్ల నుండీ 1.5 కోట్లు వరకు తీసుకుంటారట.
*టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి కూడా 0.75 కోట్ల నుండీ 1.5 వరకు అందుకుంటారు.
* యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ 2 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటారు.
*అనూప్ రూబెన్స్  0.40 కోట్ల నుండీ 0.50 కోట్లు వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు
*కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సంగీతం అందించిన ఎన్నో చిత్రాలు తెలుగులోను డబ్ అయి మ్యూజికల్ గా కూడా మంచి హిట్స్ ను అందుకున్నాయి.
ఈయన రెండు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: