వరుసగా మూడు రీమేక్ సినిమా లతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రీమేక్ సినిమాలు చేయడానికి కేరాఫ్ అడ్రస్ గా మారాడు విక్టరీ వెంకటేష్. ఆయన కెరీర్ లో దాదాపు 25 సినిమాలకు పైగా రీమేక్ సినిమాలను చేసి భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. ఓ విధంగా రీమేక్ సినిమాలు చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే రీమేక్ సినిమాలు చేసేటప్పుడు ఆల్రెడీ చూసిన ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని నటించాల్సి ఉంటుంది. అంతే కాదు మాతృక తాలూకు నటీనటుల హావ భావాలకు ఏమాత్రం తగ్గకుండా నటించి సినిమా ను తెరకెక్కించాల్సి ఉంటుంది.

ఒరిజినల్ సినిమా లు చేయడం తో పోలిస్తే రీమేక్ సినిమాలు చేయడమే చాలా కష్టం అని చెప్పాలి. కానీ వెంకటేష్ రీమేక్ సినిమాలను అవలీలగా చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తున్న హీరో వెంకటేష్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నిలిచి పోయాడు అని చెప్పవచ్చు. లతా నాలుగేళ్ల కాలంలో ఏకంగా నాలుగు రీమిక్స్ సినిమాలోని చేసి ఆయన ఏ హీరోకి సాధ్యం కాని విషయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్ ఆ తర్వాత హిందీలో వచ్చిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల అనే పేరుతో విడుదల చేశాడు. ఆ తర్వాత గురు నారప్ప దృశ్యం 2 సినిమాలను కూడా ఆయన రీమేక్ చేసి సంచలన విజయాలను నమోదు చేసుకున్నాడు. ఏదేమైనా వెంకటేష్ ఈ స్థాయిలో రీమేక్ సినిమాలతో విజయాలను అందుకోవడం కొంతమది హీరోలకు ఆశ్చర్యం కలిగించిన ఆయన అభిమానులకు మాత్రం ఎంతో సంతోషం కలిగిస్తుంది. వరసగా మూడు రీమేక్ సినిమాలను చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరో బహుశా వెంకటేష్ మాత్రమే కావచ్చు. భవిష్యత్తులో ఆయన నుంచి ఏంది రీమిక్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: