నాగ్ అశ్విన్ తో ఎన్టీఆర్..?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు సుమారు 60 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివతో చేస్తుండగా దాని తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత 32వ సినిమా మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో చేయనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు అశ్విన్ ప్రభాస్ మహానటి సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో మళ్ళీ ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో  వైజయంతి బ్యానర్ లో  ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లో ఎన్టీఆర్ కు జతగా దీపిక పడుకొని నటించనున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో దీపిక పడుకొనే ఎన్టీఆర్ ల తో పాటు అమితాబచ్చన్ కూడా కనిపించడం విశేషం. ఇకపోతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఎన్టీఆర్ తో కలిసి ఎలాంటి సినిమా తీస్తాడు ఏ రేంజ్ లో తీస్తాడు అనేదాని గురించి చర్చలు జరుపుతున్నారు. 

నాగ్ అశ్విన్ మహానటి సినిమా ను ఏ రేంజ్ లో  తెరకెక్కించాడు అందరికీ తెలుసు. అయితే ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో జతకట్టి మైథలాజికల్, లేదా సోసియో ఫాంటసీ సినిమా తీయని ఉన్నాడని అప్పుడే ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ నటించిన rrr ఆ సినిమా తర్వాత తన 30 31వ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రానుంది. ఎన్టీఆర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద భారీగానే అంచనాలు పెంచుకున్నారు వీరి ఫ్యాన్స్. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచిచూడాల్సిందే మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: