సూపర్ స్టార్ హీరోగా.. మంచి మెసేజ్, ఫీల్ గుడ్ మూవీ?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం వస్తూ వస్తూ ప్రేక్షకులందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటాయి. ఇక ఇలా మంచి మెసేజ్ ఇచ్చి సినిమాలు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. ఇలా తెలుగుప్రేక్షకులందరినీ కూడా కనెక్ట్ కావడమే కాదు యూత్ అందరికి కూడా ఆలోచనలో పడేసిన సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎంత మంచి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ బ్యూటీక్వీన్ కియారా అద్వానీ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శివ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణంగానే కొరటాల శివ సినిమాలు అంటే ఏదో ఒక మెసేజ్ సినిమా లో దాగి ఉంటుంది. కొరటాల తెరకెక్కించే ప్రతి సినిమా ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉంటాడు దర్శకుడు కొరటాల శివ. ఇలా ఇప్పటివరకు ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుస విజయాలు అందుకొన్నాడు.

ఇక ఇలా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలగా తెరకెక్కింది భరత్ అనే నేను సినిమా. సినిమా స్టోరీ లో భాగంగా ఊహించని విధంగాహీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతాడు. ఆ తర్వాత ఇక సిస్టం ను మార్చేందుకు మహేష్బాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నదే ఈ సినిమా. ఏకంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారికి భారీ జరిమానాలు విధించడం.. అన్యాయాన్ని సహించలేకపోవటం చేస్తాడు. ఇలా ముఖ్యమంత్రి సీట్లో ఉండి మహేష్ బాబు చేసిన  పనులుప్రతి ఒక్కరిని ఆకర్షించాయి అని చెప్పాలి. దీంతో ఇక నిజజీవితంలో కూడా ముఖ్యమంత్రి ఇలా ఉంటే ఎంత బాగుండు అని అందరూ కోరుకున్నారు.అసలు సిసలైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: